Logo
Download our app
పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు బంద్
NEWS   Apr 23,2025 09:37 pm
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు 48 గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటారీ చెక్ పోస్టును వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాక్ హై కమిషనర్‌ను సైతం ఇండియా విడిచి వెళ్ళిపోవాలని స్ప‌ష్టం చేసింది. ప్రత్యేక వీసాలను కూడా నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది. పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపి వేస్తున్నట్లు ప్ర‌క‌టించింది.
⚠️ You are not allowed to copy content or view source