Logo
Download our app
స్మితా స‌బ‌ర్వాల్..బీఆర్ఎస్ లో చేరు
NEWS   Apr 23,2025 06:03 pm
పర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గ‌జ్జ‌ల కాంతం. ముందు నీ ప‌ద‌వికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరాలంటూ సూచించారు. 2 వేల మందికి నోటీసులు ఇస్తారా అంటే వాళ్లు వేరు నువ్వు వేరా అని నిల‌దీశారు. కేసీఆర్, కేటీఆర్ తో క‌లిసి ఎన్ని దోపిడీలు చేశారో తెలియ‌దా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుంటే స్మితా సబర్వాల్‌తో కలిసి మిగతా ఐదుగురు అధికారులు వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికేసినప్పుడు జింకలు, వణ్యప్రాణులు వేరే అడవులకు పోతుంటే నువేం చేశామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source