పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదు
NEWS Apr 23,2025 03:43 pm
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ఘటన వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ ఘటనకు కారకులైన వారిని ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇప్పటికే ఎంతమంది టెర్రరిస్టులు పాల్గొన్నారనేది వెల్లడించడం జరిగిందన్నారు. ఊహా చిత్రాలు కూడా రిలీజ్ చేశామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. ఘటనా స్థలాన్ని షా పరిశీలించారు. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పిరికిపంద చర్యగా అభివర్ణించారు.