భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది
NEWS Apr 23,2025 01:25 pm
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. ఉగ్రవాదుల దాడిని ఖండించారు. బాధితులు చిందించిన రక్తం వృధా కాదన్నారు. చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు. పర్యాటకులను టార్గెట్ చేయడం బాధ కలిగించిందన్నారు. భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. భారత ప్రజల గుండెను ఈ ఘటన తీవ్రంగా గాయపర్చిందన్నారు. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.