Logo
Download our app
ఉగ్ర‌దాడిలో ప్ర‌ధాన సూత్ర‌ధారి సైఫుల్లా గుర్తింపు
NEWS   Apr 23,2025 09:37 am
జ‌మ్మూ కాశ్మీర్ లోని ప‌హ‌ల్గామ్ లో జ‌రిగిన ఉగ్ర‌వాదుల దాడి వెనుక ప్ర‌ధాన సూత్ర‌ధారి ఎవ‌రు అనే దానిపై ఆరా తీసింది భార‌త ఆర్మీ. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. ఆయ‌న కాశ్మీర్ లోనే మ‌కాం వేశారు. ఈ మొత్తం ప్లాన్ ను రూపొందించింది సైఫుల్లా క‌సూరి అలియాస్ ఖ‌లీద్ అని గుర్తించింది. త‌న‌కు ల‌గ్జ‌రీ కార్లంటే ఇష్టం. పాకిస్తాన్ సైన్యం త‌న‌ను ఎక్కువ‌గా ఆద‌రిస్తుంది. బైస‌ర్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో 27 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్ల వ‌ర్షం కురిపించారు. ఈ దాడి యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది. దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.
⚠️ You are not allowed to copy content or view source