Logo
Download our app
ఎస్ఎల్బీసీ ట‌న్నెల్ లో కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్
NEWS   Apr 23,2025 08:26 am
నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా దోమ‌ల‌పెంట‌లోని ఎస్ఎల్బీసీ ట‌న్నెల్ లో ప్ర‌మాదం జ‌రిగి నేటితో 61 రోజులు కావ‌స్తోంది. ఇంకా ట‌న్నెల్ లోనే ఆరుగురి మృత దేహాలు చిక్కుకు పోయాయి. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం ఎనిమిది మంది మృతి చెంద‌గా ఇద్ద‌రి మృత దేహాలు మాత్ర‌మే ల‌భ్య‌మ‌య్యాయి. ఇంకా ఆరు దొర‌కాల్సి ఉంది. క్రిటిక‌ల్ జోన్ వ‌ర‌కు బుర‌ద మ‌ట్టి శిథిలాలను తొల‌గించారు. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వానికి సాంకేతిక క‌మిటీ నివేదిక అందించ‌నుంది. దీనిపై స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకునే ఛాన్స్ ఉంది.
⚠️ You are not allowed to copy content or view source