సౌదీ నుంచి తిరిగి వచ్చిన మోడీ
NEWS Apr 23,2025 07:41 am
సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అర్ధాంతరంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. హుటా హుటిన ఢిల్లీకి బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా , గవర్నర్ , సీఎం ఒమర్ అబ్దుల్లాతో చర్చలు జరిపారు. తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిని అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్, రష్యా చీఫ్ పుతిన్ ఖండించారు.