జెత్వానీ ఓ బ్లాక్ మెయిలర్
NEWS Apr 22,2025 05:03 pm
మాజీ మంత్రి అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. నటి జెత్వానీ చరిత్ర మొత్తం తెలుసన్నారు. ఆమె ఓ బ్లాక్ మెయిలర్ అని సంచలన ఆరోపణలు చేశారు. కక్ష సాధింపులో భాగంగానే ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వాలు మారితే, సీఎంలు మారితే ఎవరినైనా అరెస్టు చేయొచ్చా అని ప్రశ్నించారు. డీజీపీ స్థాయి అధికారులను అరెస్టు చేస్తారా అని నిలదీశారు. ఇదేం సంప్రదాయం అని వాపోయారు. కోర్టులు వాతలు పెట్టినా పనితీరు మార్చుకోక పోతే ఎలా అన్నారు.