రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
NEWS Apr 22,2025 04:56 pm
ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు ఫిక్సింగ్ కు పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బీహానీ. ఈనెల 19న లక్నో చేతిలో 2 పరుగుల తేడాతో ఎలా ఓడి పోయిందంటూ ప్రశ్నించారు. అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ లో కూడా ఇలాగే జరిగిందన్నారు. చివరి ఓవర్ లో 9 రన్స్ చేయక పోవడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. చేతిలో 6 వికెట్లు ఉన్నా ఎందుకని ఆడలేదన్నారు. ఈ మ్యాచ్ పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.