సివిల్స్ - 2024 తుది ఫలితాలు విడుదల
NEWS Apr 22,2025 04:48 pm
యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ -2024 సంవత్సరానికి సంబంధించి రిజల్ట్స్ విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ కు మొత్తం 1009 మంది ఎంపికయ్యారు. ఇందులో IAS- 180, IPS- 147, IFS- 55 మంది ఎంపికైనట్లు వెల్లడించింది. జనరల్ కేటగిరిలో 335, EWS కేటగిరిలో 109, OBC- 318, SC-160, ST-87 మంది ఎంపికయ్యారు. దేశంలోనే మొదటి ర్యాంక్ ను శక్తి దూబే సాధించాడు. హర్షిత్ గోయల్ కు సెకండ్ ర్యాంక్, పరాగ్ కు థర్డ్ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా సత్తా చాటారు.