Logo
Download our app
మాజీ ఎమ్మెల్యే తీసుకున్న జీతం తిరిగి ఇవ్వాలి
NEWS   Apr 22,2025 04:42 pm
సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఫైర్ అయ్యారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తీసుకున్న ప్రభుత్వ జీతమంతా తిరిగి ఇచ్చేయాలన్నారు. న్యాయ వ్యవస్థలను,కేంద్ర ప్రభుత్వాన్ని చెన్నమనేని మోసం చేశాడని ఆరోపించారు. భారత పౌరుడు కాకపోయినా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రభుత్వ జీతం తీసుకున్నాడని వాపోయారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని అనేక వ్యాపారాలు చేసుకుని లబ్ధి పొందాడన్నారు. తీసుకున్న ప్రభుత్వ జీతం అంతా తిరిగి ఇచ్చేయాల‌న్నారు. దీనిపై అవసరమైతే తాము కోర్టును కూడా ఆశ్రయిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source