అపచారాలు జరిగితే పవన్ ఏం చేస్తున్నారు..?
NEWS Apr 22,2025 04:19 pm
మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. తిరుమల పుణ్య క్షేత్రంలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పిన ఆయన ఎక్కడున్నారంటూ నిలదీశారు. హిందూ మతాన్ని కాపాడడం కోసమే తాము ఉన్నామని చెప్పుకునే బీజేపీ వాళ్లు నిద్ర పోతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. మొత్తంగా సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆరోపించారు.