జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు
NEWS Apr 22,2025 03:57 pm
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు జూన్ 14న హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరగనున్నాయి. ప్రతిష్టాత్మక శీర్షికల కింద ప్రత్యేక గౌరవాలు కూడా ప్రదానం చేయబడతాయ. NTR జాతీయ చలనచిత్ర అవార్డు, పైడి జైరాజ్ చలనచిత్ర అవార్డు, బి.ఎన్. రెడ్డి చలనచిత్ర అవార్డు, నాగిరెడ్డి, చక్రపాణి చలనచిత్ర అవార్డు, కాంతారావు చలన చిత్ర అవార్డు, రఘుపతి వెంకయ్య చలన చిత్ర అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 2014 నుండి 2023 వరకు ఉన్న పది సంవత్సరాలకు ప్రతి సంవత్సరం ఒక చిత్రానికి సత్కారం దక్కుతుందన్నారు. ఫిలిం అవార్డుల కమిటీకి చైర్ పర్స్ న్ గా ఉన్నారు నటి జయసుధ.