వడదెబ్బతో ఏ ఒక్క ప్రాణం పోకూడదు
NEWS Apr 22,2025 03:45 pm
గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరివల్లే ఏపీకి విపత్తులు వస్తున్నాయని ఆరోపించారు మంత్రి వంగలపూడి అనిత. వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చించారు. వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రణాళికతో సమయం నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలన్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. గతేడాది నంద్యాలలోని గోస్పాడులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.