తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
NEWS Apr 22,2025 12:46 pm
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 66.89 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్ రెండో సంవత్సరంలో 71.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలలో బాలికలదే పై చేయిగా ఉంది. మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే 22 నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం వారం రోజుల గడువు ఇస్తున్నట్లు తెలిపారు.