Logo
Download our app
పీఎస్ఆర్ వైఎస్ఆర్ గా మారాడు
NEWS   Apr 22,2025 12:36 pm
టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ న‌రేంద్ర కుమార్ నిప్పులు చెరిగారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజ‌నేయుల‌ను మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో ఏపీ సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. విజ‌య‌వాడ‌కు త‌ర‌లించింది విచార‌ణ నిమిత్తం. గ‌త వైసీపీ హ‌యాంలో పీఎస్ఆర్ వైఎస్సార్ గా మారాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎమ్మెల్యే. ఆనాడు అధికార అహంకారంతో వ్య‌వ‌హ‌రించాడ‌ని మండిప‌డ్డారు. ఆయ‌న‌ అరెస్టు చట్టానికెవరూ అతీతులు కారనేందుకు నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వంలో ఎసిబి డిజీగా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే కాకుండా, గతంలో తనతో విభేదాలున్న వ్యక్తులు, మహిళలను తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి వేధించార‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source