రేపే 10వ తరగతి ఫలితాలు
NEWS Apr 22,2025 10:28 am
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల (ఎస్‌ఎస్‌సీ) ఫలితాలను ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను ‘మన మిత్ర’ యాప్, ‘వాట్సాప్’, ‘లీప్ మొబైల్ యాప్’ల ద్వారా సులభంగా చూడవచ్చని ఆయన తెలిపారు.