ఉర్సా క్లస్టర్స్ కి భూ కేటాయింపులు రద్దు చేయాలి
NEWS Apr 22,2025 09:36 am
మాజీ ఎంపీ కేశినాని నాని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు భూమి కేటాయించడం సబబేనని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 60 ఎకరాల సమాంతర భూమి కేటాయింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేశినేని శివనాథ్ (చిన్ని) బినామీగా ఉన్నాడని ఆరోపించారు. వెంటనే ఈ కంపెనీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యం, నిధులు, రాజకీయ సంబంధాలపై విచారణకు ఆదేశించాలని కోరారు.