Logo
Download our app
స్వంత గ‌డ్డ‌పై కోల్ కతాకు ప‌రాజ‌యం
NEWS   Apr 22,2025 09:20 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పై గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది గుజ‌రాత్ టైటాన్స్. 39 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ గిల్ రెచ్చి పోయాడు. 10 ఫోర్లు 3 సిక్స్ ల‌తో 55 బంతుల్లో 90 ర‌న్స్ చేశాడు. సాయి సుద‌ర్శ‌న్ 6 ఫోర్లు ఒక సిక్స్ తో 52 ప‌రుగులు చేశాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి తొలి వికెట్ కు 114 ప‌రుగులు జోడించారు. కోల్ క‌తా బౌల‌ర్లు చేసిన ప్ర‌య‌త్నం ఫలించ‌లేదు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 198 ర‌న్స్ చేసింది గుజ‌రాత్ టైటాన్స్. అనంత‌రం బ‌రిలోకి దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 159 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది.
⚠️ You are not allowed to copy content or view source