సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
NEWS Apr 22,2025 08:24 am
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు షాక్ ఇచ్చింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈనెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది. సాయి సూర్య డెవలపర్స్ కు ప్రమోషన్స్ చేసినందుకు మహేష్ బాబు రూ.3.5 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్ డబ్బులను నటుడు ప్రమోషన్ చేసినందుకు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది.