ఉత్తర తెలంగాణలో భగభగ
NEWS Apr 22,2025 08:19 am
వడగాల్పులు ఊపిరి పీల్చుకోనీయడం లేదు. ఎండ వేడిమికి జనం ఇబ్బంది పడుతున్నారు. ఉత్తర తెలంగాణ అంతటా తీవ్రమైన వేడి నెలకొంది. ఈ ఏడాది తొలిసారిగా 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. ఆసిఫాబాద్ లో 43.8 , నిర్మల్ లో 43.8, మంచిర్యాలలో 43.7, జగిత్యాలలో 43.6 , సిరిసిల్లలో 43.5 , పెద్దపల్లిలో 43.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే తీవ్రమైన వేడి కారణంగా ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ ను దాటేసింది. బంజారాహిల్స్ లో 41.6 , ముషీరాబాద్ లో 41.6, గాజులరామారంలో 41.5 , హబ్సిగూడలో 41.5, చార్మినార్ లో 41.4, ఖైరతాబాద్ లో 41.4 సెల్సియస్ నమోదైంది.