Logo
Download our app
వ‌డ‌గాల్పుల‌పై అప్ర‌మత్తంగా ఉండాలి
NEWS   Apr 22,2025 08:02 am
వడగాల్పులు, తీవ్ర ఎండల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలపై స‌మీక్ష చేప‌ట్టారు. వడ గాల్పులకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసి రక్షించుకోవడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడం, రాబోయే వర్షాకాలనికి సంసిద్ధత వంటి కీలక అంశాలపై చర్చించారు. అనంతరం విజయవాడలోని అగ్నిమాపక విభాగం ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో స‌మీక్షించారు. పరిశ్రమలు సహా ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వేగంగా స్పందించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సంసిద్ధంగా ఉండేలా సంబంధిత విభాగాన్ని అప్రమత్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source