విద్యుత్ సరఫరా యధావిధిగా పునరుద్ధరణ
NEWS Apr 22,2025 08:05 am
ఇబ్రహీంపట్నం, మేడిపల్లి పడమర సెక్షన్ల పరిధిలో భారీ ఈదురు గాలులు, వడగళ్ల వాన వల్ల 33కెవి లైన్ లో స్తంభాలు విరిగి వర్షకొండ, ఎర్దండి సబ్స్టేషన్ లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత రెండున్నర రోజులుగా ఆరు ఏజెన్సీల ద్వారా 40 మంది కార్మికులు అన్ని గ్రామాల్లో పనులు చేపడుతున్నారు. విరిగిన165 స్తంభాలు, పడిపోయిన 24 ట్రాన్స్ఫార్మర్లు వల్ల విద్యుత్ శాఖకు సుమారు రూ.40 లక్షల నష్టం వాటిల్లింది.