Logo
Download our app
మ‌హిళ‌ల‌పై నోరు జారితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
NEWS   Apr 21,2025 05:44 pm
మహిళల గురించి హద్దు దాటి మాట్లాడితే నోటీసులు తప్పవంటూ హెచ్చ‌రించారు తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ నేరెళ్ల శారద. ఈ ప‌ద‌వి త‌న‌కు హోదా ప్ర‌ద‌ర్శించేందుకు కాద‌ని, ఒక బాధ్య‌త‌గా భావిస్తున్న‌ట్లు చెప్పారు. కేటీఆర్ అయినా లేదా ఇంకో నేత అయినా ప‌ట్టించుకోన‌ని అన్నారు. ఆ స్థానంలో ఎవ‌రు కామెంట్స్ చేసినా చ‌ర్య‌లు తీసుకునే వాళ్ల‌మ‌ని తెలిపారు. తాను రాక ముందు క‌మిష‌న్ ఎలా ఉందో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. కానీ తాను వ‌చ్చాక మ‌హిళ‌ల ప‌ట్ల చుల‌క‌నగా చూసినా, ప్ర‌వ‌ర్తించినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source