Logo
Download our app
భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యంలోనే రావాలి
NEWS   Apr 21,2025 07:13 am
శ్రీవారి ద‌ర్శ‌న టోకెన్లు, టికెట్లు క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యంలోనే ద‌ర్శ‌న క్యూలైన్ల‌లోకి ప్ర‌వేశించాల‌ని టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి కోరారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డంతో స‌ర్వ ద‌ర్శ‌న క్యూలైన్ల‌ను ప‌రిశీలించారు. టీబీసీ, ఏటీసీ వ‌ద్ద క్యూలైన్ల‌లో భ‌క్తుల‌కు చేసిన ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు. క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా అన్నప్ర‌సాదాలు పంపిణీ చేసేందుకు ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహిక‌ల్స్ ను త‌నిఖీ చేశారు. భ‌క్తుల‌కు ఇబ్బంది త‌లెత్త‌కుండా అన్న ప్ర‌సాదాలు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source