ఎంఐఎం,కాంగ్రెస్ రెండూ ఒక్కటే
NEWS Apr 20,2025 06:31 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం , కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్థలంలోనే దారుసలామ్ మీటింగ్ పెట్టారంటూ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మజ్లీస్ మీటింగ్‌కి సహకరించారని ఫైర్ అయ్యారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆ మీటింగ్ పెట్టారని మండిపడ్డారు. ఓల్డ్ సిటీలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం పెట్టారా అని ప్రశ్నించారు.