వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఆకస్మిక తనిఖీలు
NEWS Apr 20,2025 06:12 pm
శ్రీవారి దర్శనార్థం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అక్షయ కిచెన్ ను తనిఖీ చేసి భక్తుల కోసం తయారు చేస్తున్న అన్న ప్రసాదాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.