మూతపడ్డ మరుగుదొడ్లను పునరుద్దరించాలి
NEWS Apr 20,2025 05:29 pm
కొండగట్టు దిగువ ప్రాంతంలోని మూతపడ్డ మరుగుదొడ్లను పునరుద్దరించాలని జాతీయ మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ ఆలయ ఈవో శ్రీకాంత్ రావుకు వినతిపత్రం అందజేశారు. భక్తుల సౌకర్యార్థం 15 సం. క్రితం ప్రభుత్వ నిధులతో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ (మరుగుదొడ్లు) ప్రస్తుతం పూర్తిగా మూతపడ్డాయని, దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల శ్రీనివాస్, శేఖర్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, భరత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.