Logo
Download our app
అన్న‌దానానికి రూ. 44 ల‌క్ష‌ల విరాళం
NEWS   Apr 20,2025 03:08 pm
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ. 44 లక్షలు విరాళం అంద‌జేశారు. ఏప్రిల్ 20వ తేదీతో బాబుకు 75 ఏళ్లు పూర్త‌వుతాయి. ఈ సంద‌ర్బంగా తిరుమ‌ల లోని త‌రిగొండ వెంబమాంబ‌ అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ రూ. 44 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు.
⚠️ You are not allowed to copy content or view source