త్వరలో భారత్‌లో ఎలాన్ మస్క్ పర్యటన
NEWS Apr 20,2025 02:40 pm
టెస్లా చైర్మన్, ఎక్స్ సిఇఈ ఎలాన్ మస్క్ త్వరలో భారత దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే అమెరికా టూర్ సందర్బంగా ప్రధానమంతి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్ సర్కార్ లో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు ఎలాన్ మస్క్. స్టార్ లింక్ తో నేరుగా ఉపగ్రహం ద్వారా భారత్ లో ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ఇదే క్రమంలో టెస్లా కార్ల ఉత్పత్తి, అమ్మకాలపై దృష్టి సారించనున్నారు. పీఎంతో మరోసారి భేటీ కానున్నారు మస్క్.