TG09F0001 నంబర్ బాలయ్యకే
NEWS Apr 20,2025 09:19 am
నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తన కారు కోసం ఫ్యాన్సీ నంబర్ దక్కించుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో నిన్న నిర్వహించిన వేలంలో రూ. 7.75 లక్షలు చెల్లించి TG09F0001 నంబర్‌ను సొంతం చేసుకున్నారు. బాలయ్య త్వరలోనే రిజిస్టర్ చేసుకోనున్న తన బీఎండబ్ల్యూ వాహనం కోసం ఈ నంబర్‌ను తీసుకున్నారు.