24న ఎవరికీ ఓటు వేయొద్దు
NEWS Apr 20,2025 01:58 am
మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యా బలం లేదని, అందుకే అభ్యర్థిని నిలబెట్ట లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వదన్నారు. ఎవరూ కూడా ఈనెల 24న ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. ఎంఐఎం, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటేనని ఆరోపించారు. విప్‌ను ధిక్కరించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దూరంగా ఉండాలన్నారు.