Logo
Download our app
ప్ర‌భుత్వ భూముల‌లో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు
NEWS   Apr 20,2025 01:44 am
హైడ్రా దూకుడు పెంచింది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొల‌గించింది. వివిధ కోర్టులలో కేసులున్నప్పటికీ చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు తెర లేపాయి బ‌డా నిర్మాణ సంస్థ‌లు. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ, కొండపూర్లోని ఆఫీజపేట సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాలు ఉండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి.స‌ర్వే నంబ‌రు 79 ప్ర‌భుత్వ భూమి, నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డుల‌లో న‌మోదై ఉంది. ఆ స‌ర్వే నంబ‌రు 79/1 గా సృష్టించి ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించి అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టింది హోమ్స్ సంస్థ‌. వీటిని తొల‌గించారు.
⚠️ You are not allowed to copy content or view source