అవగాహనే అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట
NEWS Apr 20,2025 01:38 am
అగ్ని ప్రమాదాల నివారణకు ఏం చేయాలనే అంశంపై అందరిలో అవగాహన అవసరమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఫైర్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా హైడ్రా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు. ఒక్క అగ్ని ప్రమాదం కూడా జరగకూడదు అనే లక్ష్యంతో అందరూ కలసి పని చేస్తే తప్పకుండా అది సాధ్యమౌతోందని అన్నారు. ఫైర్ సేఫ్టీ విధానాలను అందరూ అనుసరించేలా చర్యలు తీసుకోవాలని.. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని సూచించారు.