చెలరేగిన బట్లర్ తలవంచిన ఢిల్లీ క్యాపిటల్స్
NEWS Apr 20,2025 01:19 am
ఐపీఎల్ టోర్నీలో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో టేబుల్ టాపర్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు చుక్కలు చూపించాడు జోస్ బట్లర్. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 204 రన్స్ చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టులో జోస్ బట్లర్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 3 పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయ్యాడు. 97 రన్స్ చేశాడు. రూథర్ ఫోర్డ్ తో కలిసి 119 రన్స్ జోడించారు. తను 43 పరుగులు చేశాడు.