రేవంత్ సర్కార్ పై స్మిత ఫైర్
NEWS Apr 19,2025 07:18 pm
తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎక్స్ వేదికగా సీరియస్ గా స్పందించారు. తనను ఒక్కదానినే టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తనతో పాటు 2 వేల మందికి పైగా షేర్ చేశారని, మరి వారందరికీ నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. తను లేవదీసిన ప్రశ్నలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తాను మహిళలకు ఆదర్శ ప్రాయంగా ఉన్నానని పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ పేర్కొన్నారు.