పాఠశాలకు వాటర్ కూలర్ బహూకరణ
NEWS Apr 19,2025 07:03 pm
ఎండపల్లి: మండలంలోని గుల్లకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2016, 17 విద్యా సంవత్సరంలో చదువుకున్న చుంచు అజయ్, లక్కం సాహిత్ కుమార్ లు అకాల మరణం చెందారు. మృతుల జ్ఞాపకార్ధంగా వీరితో కలిసి చదువుకున్న సహచర పదవ తరగతి మిత్ర బృందం కొన్ని డబ్బులు జమచేసి గుల్లకోట జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలకు తాగు నీటిని చల్లబరిచే యంత్రాన్ని బహూకరించారు. ఎంఈఓ జి. రామచంద్రం, ఉపాధ్యాయ, విద్యార్థుల బృందం పాల్గొన్నారు.