వైఎస్ విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
NEWS Apr 19,2025 05:38 pm
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన తల్లి వైఎస్ విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 19న తన తల్లి పుట్టిన రోజును గుర్తు చేసుకున్నారు. ఇవాల్టితో తన తల్లి 69వ సంవత్సరంలోకి అడుగు పెడుతోందన్నారు. తన పట్ల తన తల్లికి ఉన్న ప్రేమ, అనుబంధం గురించి మాటల్లో చెప్పలేనన్నారు. ఎల్లప్పుడూ తనతో పాటే ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జీవుల దేశంలో మీరు ప్రభువు మంచితనాన్ని చూస్తారని తాను నమ్ముతున్నానని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో కూడా ఇలాగే నవ్వుతూ ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.