మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్
NEWS Apr 19,2025 05:29 pm
టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశించారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంబుడ్స్ మెన్ జస్టిస్ ఈశ్వరయ్య. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మన్ విచారణ చేపట్టింది. తాను ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో తన పేరు పెట్టుకోవాలని అజారుద్దీన్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.