Logo
Download our app
ప్ర‌జ‌ల భ‌ద్ర‌తే ప్ర‌భుత్వ ల‌క్ష్యం
NEWS   Apr 19,2025 05:14 pm
ప్ర‌జ‌ల భ‌ద్ర‌తే కూట‌మి స‌ర్కార్ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. గుంటూరు రేంజ్ లోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో సమీక్ష చేప‌ట్టారు. హైకోర్టు, రాజధాని అమ‌రావ‌తి, సచివాలయం, పార్టీ కార్యాలయాలు, నివాసాల నేపథ్యంలో భద్రతపై మరింత దృష్టి పెట్టే దిశగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గత మూడు నెలల్లో ప్రకాశం జిల్లాలో సైబర్ నేరాలు జరగ లేద‌న్నారు. గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో సైబర్ నేరాలను ఛేదించామ‌న్నారు. నెల్లూరు జిల్లా సహా అన్ని చోట్ల సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వ‌హించామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source