Logo
Download our app
ఆక్ర‌మ‌ణ‌ల కూల్చివేత దారుణం
NEWS   Apr 19,2025 04:51 pm
హైద‌రాబాద్ లోని వ‌న‌స్థ‌లిపురం ఇంజాపూర్ రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చి వేయ‌డం ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్. ఈ సంద‌ర్బంగా హైడ్రా ఆక్ర‌మ‌ణ‌ల కూల్చివేత‌ల‌పై స్పందించారు . 2005లో తాము ఈ భూమిని కొనుగోలు చేశామ‌న్నారు. ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంత‌రాలు లేవంటూ రంగారెడ్డి క‌లెక్ట‌ర్ ఎన్ఓసీ ఇచ్చార‌న్నారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ను క‌లిసి ప‌త్రాలు కూడా ఇచ్చామ‌న్నారు. అయినా కూల్చి వేశారంటూ ఆరోపించారు. ఆఫీస్ ను ఎలా కూల్చి వేస్తారంటూ ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source