Logo
Download our app
శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ఆర్థిక క‌మిష‌న్ చైర్మ‌న్
NEWS   Apr 19,2025 07:37 am
16వ ఆర్థిక కమిషన్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా, ఇతర సభ్యులు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేశారు . అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వారికి రంగనాయకుల మండపంలో శ్రీవారి ప్రసాదం, తీర్థాలను అందజేశారు. ఆర్థిక కమిషన్ కార్యదర్శి రిత్విక్ పాండే, జాయింట్ సెక్రటరీ కెకె మిశ్రా, సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, డాక్టర్ మనోజ్ పాండా, డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ కూడా స్వామి, అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source