Logo
Download our app
కళ్యాణ కట్టల్లో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
NEWS   Apr 19,2025 07:31 am
టీటీడీ చైర్మ‌న్ గా కొలువు తీరాక బీఆర్ నాయుడు తిరుమ‌ల క్షేత్రంపై ఫుల్ ఫోక‌స్ పెట్టారు. ప్ర‌ధానంగా సామాన్య భ‌క్తుల‌కు క‌నీస వ‌స‌తి, సౌక‌ర్యాల‌పై ఎక్కువ‌గా దృష్టి సారించారు. ఈమేర‌కు టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుల‌తో పాటు ఈవో, ఏఈవో, జేఈవోల‌తో క‌లిసి ఎప్ప‌టికప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. తానే స్వ‌యంగా భ‌క్తుల వ‌ద్ద‌కు వెళుతున్నారు. శ్రీ‌వారి సేవ‌కులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే దానిపై ఆరా తీశారు. టీటీడీ అంద‌జేస్తున్న ప్ర‌సాదం, అన్న దానం గురించి కూడా వాక‌బు చేశారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తులు సంతృప్తిని వ్య‌క్తం చేశారు. తిరుమల శ్రీవారికి భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట, నందకం మినీ కళ్యాణ కట్టల్లో ఆక‌స్మికంగా త‌నిఖీలు చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source