Logo
Download our app
హైదరాబాద్ లో తోషిబా కొత్త ఫ్యాక్టరీ
NEWS   Apr 18,2025 06:42 pm
తోషిబా కంపెనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హైదరాబాద్ లోని రుద్రారంలో కొత్త ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపింది. రూ. 562 కోట్ల పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు జ‌పాన్ పర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందంతో తోషిబా అనుబంధ సంస్థ ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) ఒప్పందం చేసుకుంది. విద్యుత్ సరఫరా, పంపిణీలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దీనిని ఏర్పాటు చేయ‌నుంది. కాగా రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది టీటీడీఐ.
⚠️ You are not allowed to copy content or view source