ధరణి పేరుతో మోసం చేసిన కేసీఆర్
NEWS Apr 18,2025 02:29 pm
రైతులను మోసం చేయడానికే కేసీఆర్ ధరణి తెచ్చారని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. అన్నం పెట్టే రైతు నోట్లో గత ప్రభుత్వం మట్టి కొట్టిందన్నారు. ధరణి వచ్చాక అసైన్డ్ భూములను కూడా లాక్కుని, పట్టాలు పొందారన్నారు. భూముల హక్కు పత్రాల కోసం రైతులు కాళ్లరిగేలా అధికారుల వద్దకు తిరిగినా లాభం లేకుండా పోయిందన్నారు. తాము వచ్చాక భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చామన్నారు. రైతులకు ఎలాంటి కష్టాలంటూ ఉండవన్నారు. అధికారులే ఇంటి వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు.