పలు కంపెనీలతో సీఎం చర్చలు
NEWS Apr 18,2025 08:34 am
జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు కంపెనీలతో చర్చలు జరిపారు. భారత రాయబార కార్యాలయంలో పరిశ్రమల ప్రతినిధులతో భేటి అయ్యారు. టయోటా, తోషిబా, ఏసిస్, ఎన్టీటీ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. టోక్యోలోని గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం టోక్యో ప్రభుత్వంతో చర్చించనుంది సీఎం బృందం.