Logo
Download our app
చెంబెడు నీళ్లు, గుప్పుడు మ‌ట్టి ఇచ్చారు
NEWS   Apr 17,2025 06:25 pm
అమ‌రావ‌తికి చెంబెడు నీళ్లు, గుప్పెడు మ‌ట్టి మాత్ర‌మే ప్ర‌ధాన‌మంత్రి మోదీ సాయం చేశార‌ని ఎద్దేవా చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టారంటూ వాపోయారు. ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారంటూ మండిప‌డ్డారు. చివరికి ఆత్మ గౌరవం అమరావతిని మోడీ శంకుస్థాపనల ప్రాజెక్ట్ కింద మార్చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది ఘరానా మోసం, రాష్ట్రానికి చేసింది ద్రోహం అంటూ మండిప‌డ్డారు. పోలవరం ఎత్తు తగ్గించి తీరని అన్యాయం చేశార‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source