Logo
Download our app
అంగన్వాడి సెంటర్లో గర్భిణీలకు శ్రీమంతాలు
NEWS   Apr 17,2025 02:21 pm
మెట్పల్లి ఇందిరానగర్ అంగన్ వాడి సెంట‌ర్ లో పోష‌ణ ప‌క్వాడ్ పోష‌ణ ప‌క్షం కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీ మ‌ణెమ్మ‌. గ‌ర్బిణీల‌కు ఆరోగ్య ప‌రిర‌ణ గురించి సూచించారు. పోష‌క విలువ‌ల‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాల‌ని, ర‌క్త‌హీన‌త ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. ఆరు నెల‌ల దాటిన పిల్ల‌ల‌కు పోష‌కాహారంపై జాగ్ర‌త్త‌లు వివ‌రించారు. పిల్ల‌ల త‌ల్లుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. పోష‌ణ లోపం ఏ ఇంటిలో , ఏ ఊరిలోనూ క‌నిపించ కూడ‌ద‌న్నారు. ఈ సంద‌ర్బంగా గ‌ర్భిణీల‌కు సీమంతం నిర్వ‌హించారు.
⚠️ You are not allowed to copy content or view source