Logo
Download our app
అలిపిరి టోల్ గేట్ ఆక‌స్మిక త‌నిఖీ
NEWS   Apr 16,2025 04:29 pm
తిరుప‌తిలోని అలిపిరి టోల్ గేట్ ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ వి. హ‌ర్ష వ‌ర్ద‌న్ రాజు. స్కానర్ మానిటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రతి ఇమేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అనుమానంగా ఉన్న వస్తువులను సిబ్బంది వేంటనే ఫిజికల్ గా తనిఖీ చేయాలన్నారు. వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్.పి.ఎఫ్, విజిలెన్స్ సిబ్బందికి సూచించారు. వాహనాలు రద్దీగా ఉన్నాయని, తనిఖీలు చేస్తున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించ వద్దని హెచ్చ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source