Logo
Download our app
చంద్రబాబుపై వ‌డ్డే సీరియ‌స్ కామెంట్స్
NEWS   Apr 16,2025 04:04 pm
సీఎం చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర్ రావు. ఇంకెంత కాలం రైతుల‌ను మోసం చేస్తారంటూ మండిప‌డ్డారు. ఇప్ప‌టికే 34 వేల ఎక‌రాలు తీసుకున్నారని అన్నారు. అంతకు ముందే వాగులు , కొండలు , రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉందన్నారు. సెక్రటేరియట్ , హైకోర్టు , అసెంబ్లీ , పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమేన‌ని చెప్పారు. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్ , హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారని అద‌నంగా మ‌రో 44 వేల ఎక‌రాలు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌డం దారుణ‌మ‌న్నారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పు చేసిన మీరు ఇంకా 69 వేల కోట్లు కావాల‌ని చెప్ప‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source